ఒకతను ఒక అందమైన యువతిని ఇష్టపడి ప్రేమించి పెళ్ళిచేసుకున్నాడు. వారిద్దరూ అన్యోన్యంగా సంసారం సాగిస్తున్నారు. ఒక రోజు ఆమెకు చర్మంపై మచ్చలు రావడం గమనించింది. మెడిసిన్ వాడుతున్నా అవి తగ్గకపోవడంతో, బయటకు రాలేక కుమిలిపోతుండేది.
ఇదిలా ఉండగా ఒకరోజు
కాంప్ కు వెళ్ళిన తన భర్త కారు ప్రమాదానికి గురవ్వడం, తలకి బలమైన గాయమై చూపుకోల్పోవడం
జరిగింది. దీనితో ఆ దంపతులకు పెద్ద కష్టమొచ్చినట్లైంది. అయినా ఇద్దరూ అలాగే జీవితం
సాగిస్తున్నారు. అనందంగా, సంతోషంగా, ప్రేమగా ఒకరికొకరు సహకరించుకుంటూ ఏ సమస్యనైనా దాటుకుంటూ
జీవనం సాగిస్తున్నారు. ఒకరోజు అనుకోకుండా మెట్లు దిగుతుండగా జారి పడిపోయి భార్య చనిపోతుంది.
భర్త ఆమె అంతిమ
సంస్కారాలు పూర్తిచేసి ఆ నగరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. వెళుతూండగా ఒక మిత్రుడు
ఎదురై అడుగుతాడు.."ఇన్నాళ్ళూ భార్య సహకారంతో బ్రతికావు. ఇపుడీ గుడ్డితనంతో రోజులు
ఎలా గడపగలవు?" అని. దానికి భర్త తన నల్ల
కళ్ళజోడు తీసేస్తూ ..."నేను గుడ్డివాడిని కాదు. తన చర్మరోగం, అందవికారం చూసి నేను
బాధపడతాననీ, అసహ్యించుకుంటానేమోనని నా భార్య కుమిలిపోయేది. అందుకే తను బాధపడకూడదని
నేనే గుడ్డితనం నటించాను...." అన్నాడు కన్నీళ్ళు వస్తుండగా, సంతృప్తిగా చిరునవ్వు
నవ్వుతూ! (మిత్రులారా! మనకిష్టం లేని చాలా లక్షణాలు మనకిష్టమైన వారిలో కనిపించవచ్చు.
మనం ఒక్కటే ఆలోచించాలి. మనం మన మనసునుండీ తొలగించాల్సింది ... ఆ వ్యక్తినా? లేక ఆ లక్షణాన్నా??
ఈ చిన్న మీమాంస
వీడితే ఎవర్నీ ద్వేషించం ఎవరినీ నిర్లక్ష్యం చేయము.)
Comments
Post a Comment